ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 4 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘ఆగడు’. మహేష్, శ్రీను వైట్ల కాంభినేషన్ లో వచ్చిన ‘దూకుడు’ చిత్రంలో బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ లాంటి కమెడియన్లను శ్రీను వైట్ల ఏ రేంజిలో వాడుకున్నాడో తాజాగా వస్తున్న ‘ఆగడు' చిత్రంలోనూ అదే విధంగా కమెడియన్లు వాడుకుని థియేటర్లో నవ్వుల వర్షం కురిపించబోతున్నాడు శ్రీను వైట్ల. ఈ సారి బ్రహ్మానందంకు తోడుగా పోసాని కృష్ణ మురళి కూడా సినిమాకు జతయ్యాడు. చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఆగడు’ చిత్రంలోని తన క్యారెక్టర్ గురించి ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ... ‘ఆగడు’ చిత్రంలో నేను పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాను అనే వార్తలు వస్తున్నాయి... నిజానికి నేను ‘ఆగడు’ చిత్రంలో ఒక విలేజ్ లో ఉండే స్వీట్ షాప్ ఓనర్ పాత్రలో కనిపిస్తాను అంటూ తన వివరించింది.