English | Telugu

సరైనోడు టీజర్ రివ్యూ

అల్లు అర్జున్ తో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా సరైనోడు. స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్, పూర్తి మాస్, అవుట్ అండ్ అవుట్ వయలెన్స్ లో సినిమాలు తెరకెక్కించే బోయపాటి శ్రీను కాంబినేషన్ కావడంతో, ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. నిన్న రిలీజైన ఈ సినిమా టీజర్ గురించి పబ్లిక్ లో టాక్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

పాజిటివ్స్
దర్శకుడు ఎవర్ని టార్గెట్ చేసి టీజర్ కట్ చేశాడో, ఆ మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. అందుకే టీజర్ కట్ కూడా హై పీక్ టెంపో తో ఉండేలా చూశాడు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ టీజర్ చూసి తమ హీరోకు మరో హిట్ పడిపోతుందనే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. మాస్..ఊర మాస్ అని బన్నీ చెప్పిన డైలాగ్ సూపర్బ్ గా ఉందంటూ కితాబులిస్తున్నారు.

నెగటివ్స్
ఈ మధ్య ప్రేక్షకులకు కాపీ విషయంలో ఎక్కువ దొరికిపోతున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్. గతంలోనే అనేక పాటల్ని ఒరిజినల్ తో సహా యూట్యూబ్ లో పెట్టి జనాలు తమన్ ను టార్గెట్ చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తమన్ కూడా ఒప్పేసుకున్నాడు. తాజాగా సరైనోడు టీజర్లో కూడా ప్రేక్షకులకు దొరికిపోయాడు. టీజర్ ప్లే చేయగానే, ఈ సౌండ్ ట్రాక్ ఎక్కడో విన్నట్టుందే అని ఫీలయిన ప్రేక్షకులు, దాన్ని కనిపెట్టడానికి కూడా ఎక్కువ టైం తీసుకోలేదు. హాలీవుడ్ సినిమా ట్రాన్స్ ఫార్మర్ 3 ట్రైలర్ చూసిన ఎవరికైనా ఈ ట్రాక్ సుపరిచితంగా అనిపిస్తుంది. దీంతో ఇప్పుడు తమన్ మళ్లీ సెంటరాఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఇక నెటిజన్లకు మరో టార్గెట్ గా మారాడు బోయపాటి. ఆయనకు ఫిజిక్స్, గురుత్వాకర్షణ శక్తి లాంటివి అసలు ఐడియా లేదంటూ ఫేస్ బుక్, ట్విట్టర్లలో సెటైర్లు వేస్తున్నారు జనాలు. ఒంటిచేత్తో మనిషిని పైకెత్తి పడేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా మొదటినుంచీ బోయపాటి సినిమాల్లో, ఇలాగే ఉండటం విశేషం. ముఖ్యంగా బాలకృష్ణ లెజండ్, సింహా సినిమాల్లో ఈ మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది.


మరో వైపు కేవలం స్టార్టింగ్ మ్యూజిక్ మాత్రమే అలా ఉంది, మిగిలిన ట్రాక్ అంతా డిఫరెంటే కదా అంటూ తమన్ ను సపోర్ట్ చేస్తున్నారు సరైనోడు అభిమానులు. సరైనోడు టీజర్ తో పాటు, ట్రాన్స్ ఫార్మర్స్ ట్రైలర్ ను కూడా కింద ఇస్తున్నాం. హావ్ ఎ లుక్..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.