English | Telugu

సర్దార్ గబ్బర్ సింగ్ కు మెగా బ్రదర్స్ వస్తున్నారా..?

చిరు 50వ బర్త్ డే ఫంక్షన్ లో నాగబాబు స్పీచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ స్పీచ్ దెబ్బకు, మెగాబ్రదర్స్ మధ్య గొడవలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఆరోజు నాగబాబు ఫైరింగ్ ఆ స్థాయిలో ఉంది. కానీ తర్వాత చిరు బర్త్ డే కి ఇంటికెళ్లి విష్ చేసి, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అందరికీ చాటి చెప్పాడు పవన్. ఆ తర్వాత చిరు కూడా సర్దార్ గబ్బర్ సింగ్ సెట్ కు వెళ్లి మరీ పవన్ ను పలకరించారు. దీంతో తమ మధ్య ఉన్న బంధం అలాగే ఉందని చిరు పవన్ లు తమ ఫ్యాన్స్ కు మెసేజ్ ఇచ్చారు.

తాజా సమాచారం ప్రకారం, సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారట. మార్చి 12 న అమరావతిలో భారీ ఎత్తున చేయబోయే ఆడియో రిలీజ్ లో స్పెషల్ గెస్ట్ లుగా చిరంజీవి, నాగబాబులను పిలవాలని ప్లాన్ చేస్తున్నారట. చివరిగా గబ్బర్ సింగ్ సినిమా టైంలో కలిసి కనిపించిన ఈ ముగ్గురూ ఇప్పుడు మళ్లీ సర్దార్ కు కలవబోతున్నారని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మెగాఫ్యాన్స్ కు సర్దార్ ఆడియో ఫంక్షన్ పండగ అనడంలో ఆశ్చర్యం లేదు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.