English | Telugu

సరైనోడు గబ్బర్ సింగ్ ను టచ్ చేస్తాడా...?

సినిమా మొదటి రోజు ఫ్లాప్ టాక్ వచ్చి, గ్యాడ్యువల్ గా పికప్ అయి సెన్సేషన్ సృష్టించడమనేది ఆ మధ్య కాలంలో జరగని పని. గతంలో మహేష్ బాబు పోకిరి మొదటి రోజు ఫ్లాప్ టాక్ నుంచి ఇండస్ట్రీ హిట్ స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత మళ్లీ అలా జరిగింది లేదు. ఇప్పుడు తన సరైనోడు తో అల్లు అర్జున్ ఈ ఫీట్ ను రిపీట్ చేశాడు. డివైడ్ టాక్ వచ్చిన బన్నీ సినిమా 54 కోట్లకు పైగానే కలెక్ట్ చేసి, 60 కోట్ల క్లబ్ వైపు దూసుకెళ్తోంది. ఈ ప్రాసెస్ లో, సంక్రాంతికి రిలీజై 50 కోట్ల క్లబ్ చేరిన నాన్నకు ప్రేమతోను దాటేసింది. ఇప్పుడు టాలీవుడ్ ఆల్ టైం టాప్ ఫైవ్ సరైనోడి టార్గెట్ గా కనబడుతోంది. టాలీవుడ్ ఆల్ టైం టాప్ 5 కలెక్షన్లలో బాహుబలి, శ్రీమంతుడు, అత్తారింటికి దారేది, మగధీర, గబ్బర్ సింగ్ ఉన్నాయి. ఇప్పటికే సీతమ్మ వాకిట్లో, దూకుడు సినిమాల్ని క్రాస్ చేసేసిన సరైనోడి తర్వాతి దృష్టి రేసుగుర్రం, గబ్బర్ సింగ్ ల మీద ఉంది. ఈ రెండింటినీ దాటేస్తే టాప్ 5 లో ఈ మూవీ చేరిపోతుంది. మే 6 న సుప్రీం, సూర్య 24 వస్తున్నాయి. వాటి జోరు పెరిగితే బోయపాటి సినిమా కాస్త తగ్గడం ఖాయం. మరి బన్నీ టాప్ 5 లో చేరతాడా..? సరైనోడు జోరు కొనసాగుతుందా..చూద్దాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.