English | Telugu

అ...ఆ ట్రైలర్ రివ్యూ...!

పవన్ కళ్యాణ్ ఛీఫ్ గెస్ట్ గా నిన్న ఆడియో వేడుకు జరుపుకుంది అ..ఆ టీం. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇద్దరి గురించి కథ చెప్పాలంటే, మూడు భాగాలుగా చెప్పచ్చు. ఒక బిగినింగ్, ట్విస్ట్, ఎండింగ్..అంటూ సమంత పాత్ర ఇంట్రడక్షన్ ఇస్తూ ట్రైలర్ మొదలవుతుంది. షారుఖ్ కాజల్ ఎవర్ గ్రీన్ ట్రైన్ సీన్ టైప్ లో, నితిన్ కు ట్రైన్ లో ఉన్న సమంత చేయి అందిస్తుంది. సమంత పాత్ర ద్వారానే సినిమా రన్ అవుతుందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. మిగిలిన పాత్రలన్నీ, అనసూయ పాత్ర పెర్స్పెక్టివ్ లో సాగుతాయి. ట్రైలర్ లో ఎక్కడా కూడా నితిన్ వాయిస్ ఒకసారి మాత్రమే వినిపించడం విచిత్రం.

అనుపమా పరమేశ్వరన్ పాత్ర సినిమాలో ట్విస్ట్ అని హింట్ ఇచ్చాడు దర్శకుడు. రావు రమేష్, అనుపమా పరమేశ్వరన్ మధ్య వచ్చే డైలాగ్ మొత్తం ట్రైలర్ కు గుర్తుండిపోయే డైలాగ్. మధ్యలో శ్రీనివాస్ అవసరాల, హీరో ఫ్రెండ్ గా ప్రవీణ్ లను ఇంట్రడ్యూస్ చేశాడు త్రివిక్రమ్. చివరిగా సమంత నితిన్ ల మధ్య వచ్చే డైలాగ్ కూడా బాగుంది. నందు, వదిలేస్తున్నావా నన్ను అని సమంత అడిగితే, లవ్ చేసేంత లగ్జరీ లేదు, వదిలేసేంత లెవెలూ లేదు అని నితిన్ రెస్పాండ్ అవుతాడు. గోపాల గోపాల అలకేలరా అంటూ ఆ తర్వాతి నుంచి వినబడే సాంగ్ వినసొంపుగా ఉంది. ఈ సాంగ్ బ్యాగ్రౌండ్ లో వినబడుతుండగానే, నదియా, రావు రమేష్ లను చూపిస్తూ, సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల షాట్ లను చూపించాడు త్రివిక్రమ్. సమంతతో మొదలైన ట్రైలర్ సమంతతోనే ముగించాడు. ఓవరాల్ గా ట్రైలర్ త్రివిక్రమ్ రేంజ్ అని ఎక్ప్ పెక్ట్ చేసిన వారికి కొంచెం నిరాశే ఎదురౌతుందని చెప్పాలి. ట్రైలర్ రెండు మూడు సార్లు చూస్తే తప్ప ఎలా ఉందో అర్ధం కాదు. చూడబోతే, కావాలనే ట్రైలర్ ను అంచనాలు తగ్గించే విధంగా కట్ చేయించినట్టున్నాడు త్రివిక్రమ్. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.