English | Telugu

సరైనోడు ఆంధ్రా,తెలంగాణా కలెక్షన్స్..!

బోయపాటి డైరెక్షన్లో మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సరైనోడు సినిమా మొదటి ఆట తర్వాత డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో సినిమాకు కష్టమే అనుకున్నారంతా. కానీ విచిత్రంగా స్లోగా పికప్ అవుతూ ఫ్యామిలీలను కూడా హాళ్లకు రప్పించుకుంటున్నాడు. టాక్ పక్కన పెడితే, కలెక్షన్ పరంగా బ్రేక్ ఈవెన్ పాయింట్ ను మూవీ రీచ్ అయిపోతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు. రానున్న వారాల్లో భారీ సినిమాలేవీ లేకపోవడం కూడా సరైనోడికి ప్లస్ పాయింట్ గానే చెప్పుకోవచ్చు. టోటల్ గా సరైనోడు నాలుగు రోజుల్లో (సోమవారం వరకూ) 25.79 కోట్లు షేర్ కొల్లగొట్టాడు. సరైనోడు కలెక్షన్స్ ఏరియా వైజ్ డిటెయిల్స్..

నైజాం 8.45
సీడెడ్ 5.11
నెల్లూర్ 1.05
కృష్ణా 1.67
గుంటూర్ 2.50
వైజాగ్ 2.95
తూర్పు గోదావరి 2.10
పశ్చిమ గోదావరి 1.96

మొత్తం 25.79 (In TS, AP)

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.