English | Telugu

ఓవర్సీస్ లో సరైనోడి హాఫ్ మిలియన్ మార్క్..!

భారీ అంచనాలతో విడుదలైన అల్లు అర్జున్ సరైనోడి టాక్ యావరేజ్ గా ఉన్నా, కలెక్షన్లు మాత్రం స్పీడ్ గానే ఉన్నాయి. మొదటి రోజే యుఎస్ టాప్ 15 లిస్ట్ లోకి చేరిపోయిన సరైనోడు కలెక్షన్లు, తాజాగా హాఫ్ మిలియన్ మార్క్ ను దాటేశాయి. 515వేల డాలర్లు కలెక్ట్ చేసి, ఈ మార్క్ ను దాటి ముందుకు దూసుకెళ్తోంది సరైనోడు మూవీ. టాక్ మిక్స్ డ్ గా ఉన్నా, కలెక్షన్స్ బాగుండటం పట్ల మూవీ యూనిట్ ఖుషీ అవుతున్నారు. మాస్ డైరెక్టర్ గా పేరొందిన బోయపాటి శ్రీను డైరెక్షన్లో ఊరమాస్ అంటూ బన్నీ చేసిన యాక్టింగ్ బి సీ సెంటర్లను ఆకట్టుకుంటోంది. కానీ ముందుగా అనుకున్నట్టుగానే, లాజిక్ లేకపోతే సినిమాను రిజెక్ట్ చేసే మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు సరైనోడు లెక్క అర్ధం కావట్లేదు. విలన్ గా ఆది, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో తమన్, సినిమాను తన మీద వేసుకుని నడిపించిన బన్నీకి మంచి మార్కులు పడుతున్నాయి. వచ్చేవారం వారానికి సరైనోడి కలెక్షన్ రిపోర్ట్ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.