English | Telugu

మమ్మీ సినిమాకు ఎంపికైన బాలీవుడ్ హీరోయిన్..!

బాలీవుడ్ భామలకు హాలీవుడ్ రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలుకుతోంది. దీపికా పడుకోనే, ప్రియాంకా చోప్రాలు హాలీవుడ్ లో హల్ చల్ చేయడం కోసం వెళ్లిపోయారు. ప్రియాంక క్వాంటికో టీవీ సీరీస్ తో, ఇప్పుడు బేవాచ్ సినిమాతో ఫ్యామస్ అయితే, దీపికా 'ట్రిపుల్ ఎక్స్: జాండర్‌ కేగ్ రిటర్న్స్ ' మూవీలో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా మరో బాలీవుడ్ భామ హాలీవుడ్ బాట పడుతోంది. అది కూడా అలాంటిలాంటి సినిమా కాదు. ఏకంగా హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటిస్తున్న సినిమా. ద గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ సినిమాతో బాలీవుడ్ లో కాస్త గుర్తింపు తెచ్చుకున్న హ్యూమా ఖురేషీ, హాలీవుడ్ లో మమ్మీ సీరీస్ లో థర్ట్ పార్ట్ కు ఎంపికైంది. దీనికోసం నిర్వహించిన ఆడిషన్లో ఆమె సక్సెస్ అయిందని, హ్యూమా అధికార ప్రతినిధి ప్రకటించాడు. మమ్మీ సీరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ పొందాయో చెప్పనక్కర్లేదు. అలాంటి సూపర్ హిట్ సీరీస్ లో టామ్ క్రూజ్ పక్కన అవకాశం రావడమంటే ఖురేషీ పంట పండినట్టే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.