English | Telugu
"హుషారు"తో పవన్ కళ్యాణ్ బిజీ అవుతున్నాడు..!
Updated : Apr 18, 2016
ఎప్పుడెప్పుడా అంటూ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సర్దార్ గబ్బర్ సింగ్ అభిమానుల అంచనాలను
అంతగా అందుకోలేకపోవడంతో పవన్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తన అభిమానుల్ని డిప్రెషన్ లోంచి బయట పడేయాలని చూస్తున్న పవర్ స్టార్ తనకు ఖుషీలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబందించి చర్చలు ఇప్పటికే పూర్తవ్వడంతో త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఖుషీకి సీక్వెల్‌గా ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఓ ప్రేమకథగా సినిమా ఉండనుంది. ఈ మూవీకి హుషారు అనే పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ ఎనర్జీ, స్టైల్‌కి తగ్గట్టు హుషారు సరిగ్గా సెట్టవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నెల 29న ఈ సినిమాను లాంచ్ చేయాలని పవన్ భావిస్తున్నారు. దీనిని పవన్ మిత్రుడు, శరత్ మరార్ నిర్మించనున్నాడు.