English | Telugu
అన్నయ్య పరువు తీసిన తమ్ముడు పవన్..!
Updated : Apr 9, 2016
‘ఇంద్ర’ చిత్రంలోని ‘ధాయి ధాయి దామ్మ’ పాటలో మెగాస్టార్ చిరంజీవి వేసిన ‘వీణ స్టెప్’ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు! చిరంజీవి సూపర్ గ్రేస్‌తో వేసిన ఈ స్టెప్‌ను చూడటానికే చాలా మంది మెగాభిమానులు రెండోసారి.. మూడోసారి కూడా ‘ఇంద్ర’ సినిమాను చూశారు. అన్నయ్య వీణ స్టెప్‌కున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన లేటేస్ట్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్‌లో ఈ స్టెప్‌ను ట్రై చేశాడు. స్క్రీన్ మీద పవన్ నాట్య విన్యాసాన్ని చూసిన అభిమానుల ముఖంలో వెరియేషన్స్ వింతగా మారిపోయాయి. పవన్ ఈ ప్రయోగం ద్వారా ఆ స్టెప్ కి వచ్చిన క్రేజ్ ని మొత్తం పొగొట్టేశాడని సగటు అభిమాని బాధపడ్డాడు.
అయినా అన్యయ్యలా పవన్ డ్యాన్స్ వేయలేడు. కేవలం మూవ్ మెంట్స్ , స్టైల్ , బాడీ లాంగ్వేజ్‌తో పని కానిచ్చేస్తాడు. డ్యాన్స్ వేయడంలో మెగాస్టార్ గ్రేస్, రిథమ్ వేరు. ఎంతోమంది యంగ్ హీరోలు ఆ గ్రేస్‌ను అందుకోవాలని చూసి చేతులు కాల్చుకుంటే అసలు డ్యాన్సే రాని పవన్‌కి ప్రయోగాలేందుకంటూ క్రిటిక్స్ విమర్శిస్తున్నారు. ఎప్పటికైనా క్లాసిక్ క్లాసిక్కే వాటిని టచ్ చేసి పేరును చెడగొట్టకూడదని మరోసారి ప్రూవ్ అయింది.