English | Telugu
సర్దార్ టిక్కెట్ల కోసం చేయ్యి విరగొట్టుకున్నాడు
Updated : Apr 8, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఉగాది కానుకగా ఇవాళ థియేటర్లలో దిగింది. అయితే తమ అభిమాన హీరో సినిమాను తొలిరోజే చూసేందుకు వీరాభిమానులు పాట్లు పడుతుంటారు. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా టిక్కెట్ల కోసం అభిమానులు మధ్య జరిగిన తొక్కిసలాటలో ఒక అభిమాని చేయి విరిగింది. హైదరాబాద్ వనస్థలిపురం విష్ణు థియేటర్‌లో పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజైంది. దీంతో మార్నింగ్ షో టిక్కెట్ల కోసం భారీ రద్దీ నెలకొంది. ఉదయం టిక్కెట్లు కోసం జనాలు విపరీతంగా చేరకున్నారు. గేటు ఒక్కసారిగా తెరవడంతో జనాలు తోసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా టిక్కెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి గాయపడటంతో అతని చేయి విరిగింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తోటి అభిమానులు ఆస్పత్రికి తరలించారు.