English | Telugu

ప‌వ‌న్ పై మ‌రో న‌మ్మ‌లేని గాసిప్‌

వివాదాల‌కూ, విమ‌ర్శ‌ల‌కూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత దూరంగా ఉండాల‌నుకొంటాడో... అవి అంత ద‌గ్గ‌ర‌వుతుంటాయి. ప‌వ‌న్‌పై వ‌చ్చే గాసిప్పుల‌కూ అంతూ పొంతూ ఉండ‌దు.రోజుకొక‌టైనా పుడుతూనే ఉంటుంది. అయితే వాటిపై ఏనాడూ ప‌వ‌న్ స్పందించ‌డు. తాజాగా ప‌వ‌న్ పై మ‌రో గాసిప్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. స‌ర్దార్ సెట్లో ప‌వ‌న్ ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌పై చేయిచేసుకొన్నాడ‌న్న‌ది ఆ రూమ‌ర్ల సారాంశం. ఇటీవ‌ల స‌ర్దార్ సెట్ కి స్నేహ‌పూర్వ‌కంగా వ‌చ్చాడు త్రివిక్ర‌మ్‌. ఆ స‌మ‌యంలో ప‌వ‌న్ సెట్లో లేడ‌ట‌. ప‌వ‌న్ వ‌చ్చే వ‌ర‌కూ త్రివిక్ర‌మ్‌ని ఖాళీగా ఉంచ‌డం ఎందుకూ...?? అనుకొన్నాడేమో, ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌... స‌ర్దార్ ఫుటేజీలో కొంత భాగాన్ని త్రివిక్ర‌మ్‌కి చూపించాడ‌ట‌.

ఈ విష‌యం తెలుసుకొన్న ప‌వ‌న్‌.. ఆ స‌హాయ ద‌ర్శ‌కుడిపై చేయి చేసుకొన్నాడ‌ట‌. ఫుటేజ్‌ని ఎవ‌రు చూపించ‌మ‌న్నారు? అంటూ ఫైర్ అయ్యాడ‌ట‌. వెంట‌నే ఆ స‌హాయ ద‌ర్శ‌కుడ్ని టీమ్ లోంచి తొల‌గించార‌ని స‌మాచారం. అయితే ఈ విష‌యంపై ఆరా తీస్తే.. చిత్ర‌బృందం స్పందించ‌డం లేదు. `మైకు ప‌ట్టుకొంటే నీతులు మాట్లాడే ప‌వ‌న్‌.. బ‌య‌ట ఇలా ఉంటాడా?` అంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ సైతం విస్తుపోతున్నారు. ఎదుటి వాళ్ల‌కు చెప్పేటందుకే నీతులు ఉన్నాయి... అనే మాట నిజ‌మే మ‌రి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.