English | Telugu
సర్దార్ కొత్త రొమాంటిక్ టీజర్ అద్దిరింది..!
Updated : Apr 6, 2016
ఇంక సర్దార్ రిలీజ్ కు మరో రోజు మాత్రమే ఉంది. ట్రైలర్లు పెద్దగా కిక్కు ఇవ్వకపోవడంతో, చిన్న చిన్న టీజర్లుగా పవన్ సీన్స్ ను వదులుతూ ఇంట్రస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు సర్దార్ టీం. పవన్ హుషారు చూస్తే, మళ్లీ గబ్బర్ సింగ్ చూసినట్టే అనిపించకమానదు. ఈరోజు మరో రొమాంటిక్ టీజర్ ను రిలీజ్ చేశారు బాబీ అండ్ కో. చిన్నప్పటి నుంచి ముద్దలకు, ముద్దులకు కూడా కరువే అంటూ పవన్ హీరోయిన్ తో టీజింగ్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ అయితే ఈ టీజర్ కు ఫిదా అయిపోతున్నారు. ఇప్పటి వరకూ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ ను మాత్రమే చూపించిన సర్దార్ బ్యాచ్, ఈ సారి పవర్ స్టార్ లోని రొమాంటిక్ యాంగిల్ ను ఆవిష్కరించింది. సినిమా రిలీజ్ దగ్గరపడే కొద్దీ పవన్ ఫ్యాన్స్ హార్ట్ బీట్ కూడా పెరిగిపోతోంది. అసలే పవర్ స్టార్ సినిమా, పైగా ఉగాది సెలవులు. ఇంకేముంది, రిలీజ్ నుంచి ఐదురోజుల వరకూ సర్దార్ హాల్స్ లో హౌస్ ఫుల్ బోర్డులు ఇప్పుడే పెట్టేశారు. సెలవుల్లో సర్దార్ టికెట్ దొరికే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది. పవన్ సినిమా అంటే ఈమాత్రం ఉంటుందిలే..!