English | Telugu

స‌ర్దార్ టార్గెట్‌... శ్రీ‌మంతుడే!

టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమా... బాహుబ‌లి. ఒక‌టా రెండా ఏకంగా ఆరువందల కోట్లు సాధించి.. అద్భుతం సృష్టించింది. సాధార‌ణంగా ఏ పెద్ద హీరో సినిమా వ‌చ్చినా.. గ‌త సినిమాల రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేయ‌డం ఖాయం అంటూ ఆయా హీరోల అభిమానులు ఆశ ప‌డుతుంటారు. కానీ... ఆ ఆశ‌ల‌కూ అంద‌నంత ఎత్తుకు నిలిచింది బాహుబ‌లి. ఎలాగూ ఆ సినిమాని కొట్ట‌లేం, క‌నీసం రెండో స్థానంలో అయినా సంతృప్తి ప‌డ‌దాం...అని హీరోల ఫ్యాన్సూ ఫిక్స‌యిపోయారు. ఆ రెండో సినిమా.. శ్రీ‌మంతుడు.

మ‌హేష్ - కొరటాల శివ కాంబినేష‌న్లో వ‌చ్చిన శ్రీ‌మంతుడు బాహుబ‌లి త‌రువాతి రెండో స్థానంలో నిలిచింది.రూ.150 కోట్ల వ‌సూళ్ల‌తో టాలీవుడ్ టాప్ 2గా నిల‌చింది. శ్రీ‌మంతుడుని కొడితే.. బాహుబ‌లి త‌రువాతి స్థానంలో అయినా నిల‌బ‌డొచ్చన్న పాయింట్‌కొచ్చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్పుడు స‌ర్దార్ టార్గెట్ కూడా శ్రీ‌మంతుడే కావ‌డం విశేషం. ప‌వ‌న్ - బాబి క‌ల‌యిక‌లో రూపుదిద్దుకొన్న స‌ర్దార్‌పై ఇటు టాలీవుడ్‌లోనూ, అటు ఫిల్మ్ ఇండ్ర‌స్ట్రీలోనూ భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే స‌ర్దార్‌పై భ‌యంక‌ర‌మైన బ‌జ్ ఉంది. ఏకంగా 42 దేశాల్లో స‌ర్దార్ సినిమా విడుద‌ల అవుతోంది. బాలీవుడ్‌లోనూ 800 థియేట‌ర్లు స‌ర్దార్ కోసం అట్టిపెట్టారు. ఆంధ్ర‌, తెలంగాణ‌ల్లో దొరికిన ప్ర‌తీ థియేట‌ర్‌లోనూ స‌ర్దార్ బొమ్మే ప‌డ‌బోతోంది. సినిమా కాస్త నిల‌బ‌డినా.. పోటీ ఇచ్చే మ‌రో సినిమానే లేదు. యావ‌రేజ్ టాక్ వ‌చ్చినా... సర్దార్ వసూళ్ల సునామి సృష్టించ‌డం ఖాయం. ఇక గ‌బ్బ‌ర్ సింగ్‌లాంటి హిట్ట‌యిపోతే చెప్ప‌క్క‌ర్లెద్దు. శ్రీ‌మంతుడు రికార్డుల‌న్నీ తిర‌గ‌రాడం గ్యారెంటీ. ఇప్పుడు ఆ న‌మ్మ‌కంతోనే చిత్ర‌బృందం ఉంది. శ్రీ‌మంతుడ్ని క్రాస్ చేసి బాహుబ‌లి త‌రువాతి స్థానంలో నిల‌బ‌డాల‌ని చూస్తోంది. మ‌రి స‌ర్దార్ ఆశ‌లు నెర‌వేర‌తాయా? శ్రీ‌మంతుడ్ని కొట్టేస్తుందా? తెలియాలంటే మ‌రో వారం రోజులు ఆగాలి.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.