English | Telugu

టాప్ ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్ లో నేను ట్రెండ్ ఫాలో అవను సెట్ చేస్తాను అంటూ ఒక డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ కు సంబంధించిన ప్రతీ విషయంలో అదే కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ట్రెండింగ్ లో టాప్ లో నిలుస్తోంది. మామూలుగానే పవన్ అభిమానుల్ని ఆపడం కష్టం. మరి ఆయన సినిమాకు సంబంధించిన స్టిల్స్, మేకింగ్ వీడియో రిలీజైతే ఇక చెప్పేదేముంది. పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ అనే హాష్ ట్యాగ్, ఐదురోజుల నుంచి టాప్ ట్రెండ్స్ వదలట్లేదు. మేకింగ్ వీడియో రిలీజవ్వగానే, అందరూ ఎక్స్ పెక్ట్ చేసినట్టుగా టాప్ లోనే ట్రెండ్ అయింది. కానీ ఆ తర్వాత కూడా ట్రెండ్ అవ్వటమే ఇక్కడ సెన్సేషన్. రేపు సర్దార్ ఆడియో టీజర్ వస్తోంది. ఆదివారమే ఆడియో ఫంక్షన్. అంటే ఇప్పట్లో సర్దార్ ట్రెండింగ్ కు ఫుల్ స్టాప్ లేనట్లే మరి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.