English | Telugu

సంజయ్ దత్ రిలీజవుతున్నాడు..ఫ్రీ బిర్యానీ తినండి..!!

అభిమానులు పలు రకాలు. తమ హీరోపై ఇష్టాన్ని వ్యక్తం చేయడంలో, ఒక్కో అభిమాని ఒక్కో స్టైల్ ని ఫాలో అవుతుంటాడు. సౌత్ ఇండియా లో విగ్రహాలు కట్టడం, పాలాభిషేకాలు చేయడం లాంటివి చేస్తుంటారు. ఇలాంటి అభిమానమే నార్త్ ఇండియాలో కూడా అప్పుడప్పుడూ కనిపిస్తుంటుంది. తాజాగా సంజయ్ దత్ వీరాభిమాని ఒకరు తన హీరో జైలు నుంచి రిలీజవుతున్న సందర్భంగా, ఫ్రీ బిర్యానీ ఆఫర్ ప్రకటించాడు..

సౌత్ ముంబైలో ఒక హోటల్ నూర్ మహ్మదీ. 1986లో ప్రారంభించిన ఈ హోటల్ ను ఓనర్ ఖలీద్ సంజయ్ దత్ చేత ఓపెనింగ్ చేయించాడు. సంజయ్ అంటే ఖలీద్ కు పిచ్చి. అందుకే ఆ తర్వాత కూడా రెగులర్ గా సంజయ్ ను హోటల్ కు పిలుస్తుండేవాడు. అక్రమాయుధాల కేసులో శిక్ష అనుభవిస్తున్న సంజయ్ దత్ ఈ గురువారం రీలీజవుతున్నాడు. దాంతో ఖలీద్ ఆ రోజు మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో ' చికెన్ సంజూబాబా ' అనే వంటకాన్ని ఫ్రీగా వడ్డించబోతున్నాడు. ఎవరైనా వచ్చి, ఆ టైంలో కుమ్మేసుకోవచ్చని ప్రకటించాడు. ఖలీద్ కు ఈ వంటకాన్ని ఎలా తయారుచేయాలో స్వయంగా సంజయ్ చెప్పాడట. అందుకే దీనికి చికెన్ సంజూబాబా అనే పేరు పెట్టాడు. దీంతో ప్రస్తుతం నూర్ మహ్మదీ హోటల్ టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఏదేమైనా అభిమానం, పబ్లిసిటీ అనే రెండు పిట్టల్ని ఒకే దెబ్బలో కొట్టిన ఖలీద్ ను మెచ్చుకోవాల్సిందే..

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.