English | Telugu
సానియాపై ఓ సినిమా
Updated : Aug 6, 2015
క్రీడాకారుల జీవితం ఆధారంగా సినిమాలు రావడం కొత్తేం కాదు. భాగ్ మిల్కా భాగ్‌తో అవి కమర్షియల్‌గానూ విజయాలు సాధిస్తాయన్న సంగతి నిరూపితమైంది. ఇప్పుడు టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై కూడా ఓ సినిమా తీస్తున్నారు. ఈ చిత్రానికి ఫరాఖాన్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. సానియా మీర్జా, ఫరాఖాన్ మంచి స్నేహితులు. అందుకే సానియా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు టాక్. సానియా పాత్రలో పరిణితీ చోప్రా కథానాయికగా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ డిసెంబరులో ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సానియా ఓ చిన్న పాత్రలో కనిపించే ఛాన్స్ ఉందని సమాచారం. మరి వెండి తెరపై సానియా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.