English | Telugu
సంపూకి ఈ జన్మకు కొబ్బరి మట్ట చాలట..!
Updated : Apr 2, 2016
కేవలం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ తో ప్రజాదరణ సంపాదించి హీరోగా క్లిక్కయ్యాడు సంపూర్ణేష్ బాబు. హృదయకాలేయంతో ఆ ప్రజాదరణను నిలుపుకున్నాడు. ఆ తర్వాత సింగం 123 అంటూ వచ్చి ఎదురుదెబ్బ తినడంతో ఈ సారి కొబ్బరి మట్ట గా వస్తున్నాడు. ఈ సినిమాలో మూడు రకాల పాత్రల్లో సంపూ కనబడతాడట. పెదరాయుడు తరహాలో పేరడీగా సాగే ఈ సినిమాకు ఇప్పటికే మంచి ప్రచారం లభించింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో పనుల్లో మూవీ టీం బిజీబిజీగా ఉంది. మరో కొద్ది రోజుల్లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నామని, హృదయకాలేయాన్ని కొబ్బరి మట్ట మించిపోతుందని చెబుతున్నాడు సంపూ. అంతేకాదండోయ్. ఎడిటింగ్ లో తన నటన చూసుకుని తానే పరవశించిపోతున్నానని చెబుతున్నాడు. తన జీవితానికి ఈ కొబ్బరి మట్ట ఒక్కటి చాలంటూ ఆనందిస్తున్నాడు సంపూర్ణేష్ బాబు. ఈ సినిమాతో సంపూ బాబు హృదయకాలేయం రేంజ్ హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి మరి..!