English | Telugu
పవన్ కళ్యాణ్ తరపున సంపూ పంచ్
Updated : Mar 18, 2016
కమాల్ ఆర్ ఖాన్ అనే కామెడీ ఐటెమ్, పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంగతి తెలుగోళ్లకు మాత్రమే తెలుసు. లేటెస్ట్ గా వాళ్ల సునామీ ఎఫెక్ట్ సదరు కమాల్ ఖాన్ మాస్టారికి గట్టిగా తగిలింది. ట్విట్లర్లో పవన్ ఫ్యాన్ ఆడుకునే ఆట తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నాడు. హలో ఫ్యాన్స్ ఆఫ్ సి గ్రేడ్ యాక్టర్ పవన్ కళ్యాణ్, స్టాప్ అటాకింగ్ మి అంటూ ట్వీట్ చేశాడు. అంటే పవన్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో కమాల్ ఖాన్ ను ఆడుకున్నారో అర్ధమవుతోంది. కానీ మనోడు మాత్రం తను కోరుకున్న పబ్లిసిటీ వచ్చేసిందని చాలా హ్యాపీగా ఉన్నాడు.
మరో వైపు టాలీవుడ్ బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు కూడా కమాల్ కు మంచి ఝలక్ ఇచ్చాడు. పవన్ కార్టూనే, కానీ బ్యాట్ మ్యాన్ టైపులో, నైస్ మీటింగ్ యూ స్నూపీ అని ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అంటే కమాల్ ఖాన్ కుక్కలా ఎంత మొరిగినా, ఏం లాభం లేదు అన్న మీనింగ్ లో సంపూ ఈ పంచ్ కొట్టాడు. దాంతో పవన్ ఫ్యాన్స్ కు కూడా సంపూని పొగడ్తలతో లేపేస్తున్నారు. భలే పంచ్ వేశావు గురూ అంటూ సంపూను పొగిడేస్తున్నారు. సంపూర్నేష్ కూడా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఫ్యామస్ అయి హీరోగా మారిన సంగతి తెలిసిందే.