English | Telugu

మహేష్, త్రివిక్రమ్ ని ఇంటర్వ్యూ చేసిన సమంత

'హుద్‌ హుద్‌' తుపాను బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినీ చిత్రపరిశ్రమ `మేము సైతం' అంటూ చేపట్టిన బృహత్తర కార్యక్రమ౦లో భాగంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ లతో కలసి అందాల తార సమంత చేసిన ఈ ఇంటర్వ్యూ అందరిని ఆకట్టుకుంది. మహేష్‌ కెరీర్‌ గురించి సమంత, సమంత గురించి త్రివిక్రమ్‌.. ఇలా ప్రశ్నలడుగుతూ కార్యక్రమాన్ని రసవత్తరంగా కొనసాగించారు.ఈ ముగ్గురి పరస్పర ఇంటర్వ్యూలో పవన్‌కళ్యాణ్‌ ప్రస్తావన రావడం. పవన్‌, మహేష్‌ చాలా విషయాల్లో ఒకేలా వ్యవహరిస్తారనీ, అదే తనను ఆ ఇద్దరికీ సన్నిహితుడ్ని చేసిందని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ చెప్పుకొచ్చారు.మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మళ్ళీ సినిమా ఎప్పుడని సమంత ప్రశ్నిస్తే, ఖచ్చితంగా 2015లో వుంటుందని త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సమాధానమిచ్చారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.