English | Telugu

స‌మంత దుకాణం క్లోజ్‌

ఒక‌ప్పుడు స‌మంత అన‌గానే.. ఆమె కాల్షీట్లు దొర‌క‌వు బాబోయ్‌.. అనుకొనేవారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇటు తెలుగులోనూ, అటు త‌మిళంలోనూ చేతినిండా సినిమాల‌తో అంత బిజీగా ఉండేది మ‌రి. ఇప్పుడంత సీన్ లేదు. త‌మిళం మాటేమోగానీ.. తెలుగులో ప్ర‌స్తుతానికి ఖాళీ అయిపోయింది స‌మంత‌. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి త‌ర‌వాత ఆమె ఒక్క తెలుగు సినిమాపైనా సంత‌కం చేయ‌లేదు. ఆ మాట‌కొస్తే.. ఆమెకు అవ‌కాశాలే రాలేదు. కొత్త‌మ్మాయిలు ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ఆదాశ‌ర్మ‌లాంటివాళ్లు స‌మంత‌కు గ‌ట్టిషాక్ ఇచ్చారు. ఈ కుర్ర హీరోయిన్ల‌తో పోటీకి త‌ట్టుకోలేక‌పోతోంది స‌మంత‌. దానికి తోడు.. గ్లామ‌ర్ కూడా రోజురోజుకీ త‌గ్గిపోతోంది. మొఖ‌క‌వ‌ళిక‌ల్లో మార్పు వ‌చ్చిన ద‌గ్గ‌ర నుంచీ ఆమెలో గ్లామ‌ర్ మ‌టుమాయ‌మైపోతోంది. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిల‌తోనూ స‌మంత చేసిందేం లేదు. స‌మంత కావాలంటే కోట్లు పెట్టాలి. అదే ర‌కుల్‌, ఆదాలాంటి వాళ్ల‌ని తీసుకొంటే ల‌క్ష‌ల్లో తేలిపోతుంది. అందుకే స‌మంత‌ని తెలుగులో ద‌ర్శ‌క నిర్మాత‌లు లైట్ తీసుకొన్నారు. దాంతో తెలుగులో స‌మంత దుకాణం దాదాపుగా క్లోజ్ అయిపోయింది. తెలుగులో మ‌ళ్లీ ఇదివ‌ర‌క‌టిలా అవ‌కాశాలు రాక‌పోతాయా?? అని ఎదురుచూస్తోందీ అమ్మ‌డు. మ‌రి.. క‌నిక‌రించే నాధులు ఎవ‌రో..??

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.