English | Telugu

అలనాటి నటి కేఆర్ విజయ కూతురికి వేధింపులు..!

రాముడి పాత్ర అంటే ఎన్టీఆర్ ఎలా గుర్తొచ్చేవారో, అమ్మవారి పాత్ర అంటే కేఆర్ విజయ అలాగే గుర్తొస్తారు. వయస్సు పైబడటంతో, గత కొంతకాలంగా కేఆర్ విజయ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు. రీసెంట్ గా ఆమె కూతురికి ఆకతాయి నుంచి వేధింపులు ఎదురయ్యాయి. విషయంలోకి వెళ్తే, కేఆర్ విజయ కూతురు హేమలత భర్తతో భేదాభిప్రాయాలు రావడంతో, కూతుళ్లతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు. కొంత కాలం క్రితం కూతుళ్లు కూడా స్టడీస్ కోసం ఫారిన్ వెళ్లడంతో, గత కొంత కాలంగా హేమలత ఒంటరిగానే ఉంటున్నారు. దీన్ని అదునుగా తీసుకుని హేమలత ఫోన్ నెంబర్ సంపాదించి, ఆమెకు మెసేజ్ లు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడు చెన్నైకి చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. తనను పెళ్లి చేసుకుంటానంటే వేధించడమే కాక, అసభ్యకరమైన మెసేజ్ లను కూడా పంపుతున్నాడంటూ కోయంబత్తూర్ పోలీస్ స్టేషన్లో హేమలత ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.