English | Telugu
అంబానీతో సెల్ఫీ దిగిన సల్మాన్ ఖాన్..!
Updated : Apr 11, 2016
సల్మాన్ తో సెల్ఫీ దిగాలని అందరూ అనుకుంటారు. ఆయనకు ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ సల్మాన్ మాత్రం వేరొకరితో సెల్ఫీ దిగి తన ట్విట్టర్లో పెట్టాడు. ఆ వ్యక్తి ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ. ముఖేష్ కు ఇద్దరు కుమారులున్నారు. పెద్దవాడు ఆకాశ్ అంబానీ. అనంత్ అంబానీ రెండో వాడు. ఆకాష్ ఇప్పటికే తండ్రికి చేదోడు వాదోడుగా బిజినెస్ చూసుకుంటుండగా, అనంత్ మాత్రం ఓవర్ వెయిట్ తో బాధపడేవాడు. ఐపిఎల్ చూసే వారందరికీ, ముంబై ఇండియన్స్ డగౌట్ లో అనంత్ కనిపించే ఉంటాడు. భారీ కాయంతో ఉన్న ఆ కుర్రాడ్ని చూసి వామ్మో అనుకునే వారందరూ. అలా అనుకున్న నోళ్లన్నింటినీ, తన వెయిట్ లాస్ తో మూయించాడు అనంత్.
కేవలం 18 నెలల్లోనే 108 కేజీల బరువు తగ్గి ఇప్పుడు అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. రోజూ 21 కిలోమీటర్లు నడక, వెయిట్ ట్రైనింగ్, హై ఇంటెన్సిటీ కార్డియో ఎక్సర్సైజులు, జీరో షుగర్ డైట్ ను ఫాలో అయి న్యాచురల్ గానే అనంత్ బరువు తగ్గాడట. ఇప్పుడు దేశవ్యాప్తంగా సెలబ్రిటీలందరూ ఈ కుర్రాడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బరువు తగ్గి తన పట్టుదలను చూపించాడని, చాలామందికి స్ఫూర్తిగా నిలుస్తాడని సల్మాన్ అంబానీని ప్రశంసించాడు. " అనంత్ అంబానీని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అతని మీద ఉన్న గౌరవం రెట్టింపైంది. 108 కేజీల బరువు తగ్గించుకోవడం సాధారణ విషయం కాదు " అంటూ సల్మాన్ ట్వీట్ చేశాడు. కేవలం సల్మాన్ మాత్రమే కాక, సచిన్, ధోనీ లాంటి వాళ్లందరూ అంబానీ పట్టుదలను ప్రశంసిస్తున్నారు.