English | Telugu
సచిన్ సినిమా పోస్టర్ రిలీజయ్యింది..!
Updated : Apr 11, 2016
క్రికెట్ ప్రపంచంలో దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఆయన జీవిత కథమీద రూపొందుతున్న సినిమా సచిన్. ఎ బిలియన్ డ్రీమ్స్ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజయ్యింది. స్వయంగా సచినే తన ట్విట్టర్లో పెట్టి తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. ఈ నెల 14న మధ్యాహ్నం మూవీ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్టు సచిన్ ప్రకటించాడు. ప్రస్తుతం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఈ ఫస్ట్ పోస్టర్ కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరూ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అజారుద్దీన్ పై అజార్ సినిమా, మహేంద్రసింగ్ ధోనీపై ధోనీ సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. సచిన్ సినిమాను జేమ్స్ ఎరిక్సన్ తెరకెక్కిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.