English | Telugu

రుద్ర‌మ‌దేవికి అంత సీన్ ఉందా??

గుణ‌శేఖ‌ర్ అనేక వ్య‌య ప్ర‌యాస‌ల్ని ఓర్చి తెర‌కెక్కించిన చిత్రం 'రుద్ర‌మ‌దేవి'. ఈ సినిమాకోసం ఇప్ప‌టి వ‌ర‌కూ రూ.60 కోట్లు ఖ‌ర్చు పెట్టాడు గుణ‌శేఖ‌ర్‌. అందులో ప‌ది కోట్లు త్రీడీకే అయ్యింద‌ట‌. తాజాగా రుద్ర‌మ‌దేవి ట్రైట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అయితే ఈ ట్రైట‌ర్‌కి మిశ్ర‌మ స్పందన వ‌స్తోంది. ఎఫెక్ట్స్ భ‌లే బాగున్నాయ‌ని కొంత‌మంది కితాబిస్తుంటే.. ఇదేంటిది.. మ‌రీ యానిమేష‌న్ సినిమాలా ఉంద‌ని మ‌రికొంత‌మంది పెద‌వి విరుస్తున్నారు. బ్లూమేట్‌లో తీసిన‌ట్టు స్ప‌ష్టంగా తెలిసిపోతోంద‌ని.. సినిమా అంతా ఇలానే ఉంటే భ‌రించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని చెబుతున్నారు. ఎఫెక్ట్స్ మ‌రీ ఎక్కువైనా ప్ర‌మాద‌మే. ఏది అస‌లు సీనో, ఏది కంప్యూట‌ర్ మాయాజాల‌మో తెలుసుకోవ‌డం క‌ష్టం. కొచ్చ‌డియాన్ కూడా ఇలానే త‌యారైంది. యానిమేష‌న్ సినిమాలా మారిపోయి.. ఎవ్వ‌రికీ థ్రిల్ క‌లిగించ‌లేదు. ఇప్పుడు రుద్ర‌మ‌దేవికీ అలాంటి ఫ‌లిత‌మే వ‌స్తుందేమో అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. పైగా అనుష్కపై రూ.60 కోట్ల పెట్టుబ‌డి రాబ‌ట్ట‌డం అంత తేలికైన విష‌యం కాదు. బ‌న్నీ, రానా ఉన్నా... వీళ్ల‌వి సైడ్ క్యారెక్ట‌ర్లే. సినిమా భారాన్ని మోయాల్సింది మాత్రం.. అనుష్క‌నే. మ‌రి స్వీటీతో అది సాధ్య‌మ‌వుతుందా? గుణ‌శేఖ‌ర్ క‌ల‌ల్ని నిజం చేసే స‌త్తా అనుష్క‌కు ఉందా?? ఈ విష‌యం `రుద్ర‌మ‌దేవి` వ‌సూళ్లే బ‌య‌ట‌పెట్టాలి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.