English | Telugu

ఈసారైనా హిట్టు కొట్టు బాబూ...

కాళిదాసు, క‌రెంట్‌, అడ్డా... ఇలా ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఓ హిట్టు సంపాదించ‌లేక‌పోయాడు సుశాంత్‌. సినిమా కోసం, ప‌బ్లిసిటీ కోసం భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టినా ప్రేక్ష‌కులు క‌నిక‌రం చూపించ‌డం లేదు. కొత్త‌వాళ్ల‌తో ప‌నిచేసి.. ఫ్లాప్‌ల‌ను మూట‌గ‌ట్టుకొన్నాడు. అందుకే ఈసారి.. హిట్టు ద‌ర్శ‌కుడ్ని ప‌ట్టుకొన్నాడు. త‌నే... మేర్ల‌పాక ముర‌ళి. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌తో సందీప్‌కిష‌న్‌కి తొలి హిట్టు అందించిన ద‌ర్శ‌కుడు గాంధీ. ఈ సినిమా త‌ర‌వాత గాంధీకి చాలా అవ‌కాశాలొచ్చాయి. అయితే శ్రీ‌నాగ్ కార్పొరేష‌న్ మాత్రం భారీ అడ్వాన్స్‌తో బ్లాక్ చేసింది. గ‌త కొంత‌కాలంగా క‌థ‌పై క‌స‌ర‌త్తులు చేసిన గాంధీ.. ఇప్పుడు ఓ క‌థ‌ని ఓకే చేయించుకొన్నాడు. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. గాంధీ అయినా.. సుశాంత్‌కి హిట్టిస్తాడేమో చూడాలి.