Read more!

English | Telugu

జపాన్ లో 'బాహుబలి-2' రికార్డు ఔట్.. నెక్స్ట్ 'ముత్తు'నే

జపాన్ లో 'ఆర్ఆర్ఆర్' రికార్డుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే 300 మిలియన్ యెన్స్ కి పైగా కలెక్ట్ చేసిన ఈ చిత్రం 'బాహుబలి-2'ని దాటేసి, జపాన్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాలలో రెండో స్థానంలో నిలిచింది.

అక్టోబర్ 21న జపాన్ లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' 34 రోజుల్లో 305 మిలియన్ యెన్స్ వసూలు చేసి సత్తా చాటింది. జపాన్ లో తక్కువ రోజుల్లో 300 మిలియన్ క్లబ్ లో చేరిన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. అంతేకాదు 'బాహుబలి-2' కలెక్షన్లను దాటేసి మొదటి స్థానం దిశగా దూసుకుపోతోంది.

జపాన్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాలలో 400 మిలియన్ యెన్స్ తో 'ముత్తు' మొదటి స్థానంలో ఉండగా.. 300 మిలియన్ యెన్స్ తో రెండో స్థానంలో 'బాహుబలి-2' ఉంది. ఇప్పుడు 305 మిలియన్ యెన్స్ తో 'ఆర్ఆర్ఆర్' రెండో స్థానంలోకి వచ్చింది. ఇదే జోరు కొనసాగితే మరికొద్ది రోజుల్లో 'ముత్తు'ని దాటేసి మొదటి స్థానానికి వచ్చే అవకాశముంది. ఫుల్ రన్ లో ఈ చిత్రం 500 మిలియన్ యెన్స్ కలెక్ట్ చేసినా ఆశ్చర్యంలేదు అంటున్నారు.