English | Telugu

ఆర్జీవీ... ఇక ఆపేయ‌మ్మా. చూళ్లేకపోతున్నాం!

రాంగోపాల్ వ‌ర్మ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టు నాగంబొట్టులా త‌యార‌వుతోంది. ప్ర‌తీ సినిమాకీ ఓ ప‌ద‌గ‌డుగు లోతుకి దిగ‌జారిపోతున్నాడేమోఅనిపిస్తోంది. ఐస్ క్రీమ్ 2 పోస్ట‌ర్లు, ప్ర‌చార చిత్రాలూ చూస్తే మ‌రోసారి వ‌ర్మ‌పై జాలితో కూడిక కోపం వ‌చ్చేస్తున్నాయ్‌. ఈ సినిమాలోని ఐస్ ఫ్రూట్... ఐస్ ఫ్రూట్ అనే గీతాన్ని విడుద‌ల చేశారు. ఈ పాట ఫ‌క్త్ థ‌ర్డ్ గ్రేడ్ పాట‌లో ఉందంటే న‌మ్మండి. క‌థానాయిక న‌వీన చెడ్డీల‌తో క‌నిపించి రెచ్చిపోయింది. క‌ప్పుకొన్న‌ది త‌క్కువ‌, విప్పుకొన్న‌ది ఎక్కువ అన్న‌ట్టు క‌నిపించింది. నందు కూడా ప్ర‌తీ షాట్‌లోనూ న‌వీన‌ను ఆశ‌గా ఆవ‌హించుకోవ‌డానికి చూస్తుంటాడు. ఆ పాట‌లో ప‌దాలు వినిపించాలే గానీ, బోలెడు బూతులున్నాయ్. పోనీ తెర‌కెక్కించిన తీరేమైనా బాగుందా అంటే.. సెల్ ఫోన్ కెమెరాలో సినిమా తీసినంత క్లారిటీ.. అటు క్వాలిటీ, ఇటు క్రియేటివిటీనే కాదు, క్లారిటీ కూడా మిస్స‌యిపోయాడు వ‌ర్మ‌. శివ‌, స‌త్య‌, స‌ర్కార్‌లు తీసిన వ‌ర్మ‌ని ఇలాంటి దుస్థితిలో చూస్తామ‌ని సామాన్య ప్రేక్ష‌కుడు కూడా ఊహించి ఉండ‌డు. వ‌ర్మ ఇంకా అథ‌పాతాళ‌లోకి జారిపోవ‌డానికి సిద్ధంగా ఉన్నా.. చూడ్డానికి మాత్రం ప్రేక్షకులు సిద్ధంగా లేర‌మ్మా..! ఆర్జీవీ ఇక ఆపేయ‌మ్మా.. చూడ‌లేక‌పోతున్నాం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.