English | Telugu
రేణూదేశాయ్ ఫీలౌతోంది
Updated : Jan 5, 2015
బద్రి లాంటి సూపర్ డూపర్ హిట్ కొట్టిన తరవాత... పవన్ కల్యాణ్‌ని పెళ్లి చేసుకొన్న తరవాత రాన్నంత పబ్లిసిటీ... పవన్‌తో విడిపోయాక సంపాదించుకొంది రేణూ దేశాయ్. ప్రెస్ మీట్ పెట్టినా, ట్విట్టర్లో స్పందించినా, ఏదైనా కామెంట్ చేసినా.. రేణు హాట్ టాపిక్ అయిపోతోంది. రేణు ఏం మాట్లాడినా పవన్ దృష్టికోణం నుంచి ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్, మీడియా. ఇది తనను చాలా ఇబ్బందికి గురిచేస్తోందని రేణు ఇప్పుడు ఫీలవుతోంది. తానెక్కడికి వెళ్లినా పవన్ గురించే అడుగుతుతన్నారని, ఆఖరికి బర్త్‌డే రోజున ప్రెస్‌తో మాట్లాడినా, పవన్ కి సంబంధించిన ప్రశ్నలే అడుగారని... పదే పదే పవన్ ని తన జీవితంతో ముడిపెట్టి మాట్లాడుతున్నారని, వపన్ పేరు వాడుకొంటున్నానని పబ్లిసిటీ చేస్తున్నారని ఫీలౌతోంది రేణు. పవన్ లేకుండా కూడా నా జీవితం ఉంది. నేనేం రోబోను కాదు, పదే పదే పవన్ కి సంబంధించిన ప్రశ్నలతో నన్ను విసిగించొద్దు అంటూ రేణు దేశాయ్ చెబుతోంది. ఇక పవన్ గురించి మాట్లాడకూడదని గట్టిగా ఓ నిర్ణయం తీసుకొందట. చూద్దాం.. ఈ నిర్ణయానికి రేణు ఎన్ని రోజులు కట్టుబడి ఉంటుందో...?!