English | Telugu
ఓటీటీలోకి భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Updated : Mar 20, 2024
ఓటీటీ వేదికలపై మాములుగా కంటెంట్ ఉన్న సినిమాలకే మంచి వీక్షకాధరణ లభిస్తోంది. అటువంటిది భారీ యాక్షన్ థ్రిల్లర్ వస్తుందంటే ఇంక ఓటీటీ లవర్స్ కి పండగే అని చెప్పాలి.
కొన్ని నెలల క్రితం రిలీజ్ అయి మంచి వీక్షకాధరణ లభించిన వాటిల్లో ది రైల్వే మెన్, రానా నాయుడు, ఫర్జీ, ఫ్యామిలీ మ్యాన్ ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో #90's వెబ్ సిరీస్, ది కేరళ స్టోరీస్ లాంటి కథలు ఎవరి ఊహకి అందకుండా క్లిక్ అయ్యాయి. అలాగే మలయాళం సినిమా భ్రమయుగం లాంటి వైవిద్యమైన కథలు తెలుగు ప్రేక్షకులకి నచ్చుతున్నాయి. ఇక తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైన సేవ్ ది టైగర్స్-2 కూడా హిట్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. ఆయితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ వేదికగా ' రెబల్ మూన్- పార్ట్ 2 : ది స్కార్ గివర్.. ఏప్రిల్ 19 న నేరుగా ఓటీటీలోకి విడుదల కానుంది. హాలీవుడ్ పాపులర్ డైరెక్టర్ జాక్ స్నైడర్ తెరకెక్కించిన రెబల్ మూన్ పార్ట్ 1 గతేడాది డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా భారీ హిట్ సొంతం చేసుకుంది. పార్ట్ వన్ హిట్ అవ్వడంతో పార్ట్ 2 ని తీసుకొస్తున్నారు డైరెక్టర్ జాక్ స్నైడర్.
300, మ్యాన్ ఆఫ్ స్టీల్, బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్, జస్టిస్ లీగ్ , డాన్ ఆఫ్ ది డెడ్ లాంటి ఎన్నో హిట్ సినిమాలని జాక్ స్నైడర్ అందించారు. పార్ట్ వన్ మాదిరి ఈ సెకెండ్ పార్ట్ ని కూడా నెట్ ఫ్లిక్స్ లోనే డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్,మలయాళం, హిందీ, ఇంగ్లీష్ తో పాటు కన్నడలో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంటుందని మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. మరి మీలో ఎంతమంది ' రెబల్ మూన్ - 1 ' చూశారు. ఒకవేళ చూడకపోతే పార్ట్-2 వచ్చేలోపే చూసేయండి. ఈ సినిమాలో సోఫియా బౌటెల్లా, ఎడ్ స్క్రీన్, మైఖెల్ హ్యూస్ మన్ , ఛార్లీ హున్నామ్, షార్లట్ మాగీ తదితరులు నటించారు. ఈ సినిమాలో ఎటువంటి అడల్ట్ సీన్స్ లేనందున ఫ్యామిలీతో కలిసి చూడొచ్చని.. సైన్స్ ఫిక్షన్ లోని థ్రిల్ ని ఆస్వాదించొచ్చని మేకర్స్ తెలిపారు. మరి మీలో ఎంతమంది ఈ సినిమా చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.