English | Telugu

బ్రేకింగ్‌... మైసూరులో ప్రారంభమైన ‘ఆర్‌సి16’ రెగ్యులర్‌ షూటింగ్‌!

రామ్‌చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో దిల్‌రాజు నిర్మిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిన తర్వాత చరణ్‌ తర్వాతి సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఉంది. ఎంతో కాలంగా ఆరోజు కోసం డైరెక్టర్‌ సానా బుచ్చిబాబు కూడా వెయిట్‌ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఈ సినిమా ప్రారంభోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. కానీ, రెగ్యులర్‌ షూటింగ్‌ మాత్రం మొదలవ్వలేదు. నవంబర్‌ వచ్చేసింది. ఇక ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ ఏడాది లేనట్టేనని అందరూ భావించారు. నెక్స్‌ట్‌ ఇయర్‌లో ఆర్‌సి16 స్టార్ట్‌ అవుతుందని అందరూ ఫిక్స్‌ అయిపోయారు.

ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్‌ మైసూర్‌లో ప్రారంభం అవుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే అది నిజమేనని డైరెక్టర్‌ బుచ్చిబాబు శుక్రవారం అందరికీ క్లారిటీ ఇచ్చారు. ఈరోజు మైసూర్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్టు తెలిపారు. మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ‘ఇది ఎంతో ముఖ్యమైన రోజు. ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి’ అంటూ ఎంతో ఎమోషనల్‌గా ట్వీట్‌ చేశారు బుచ్చిబాబు. అంతేకాదు, సినిమాకి సంబంధించిన బౌండెడ్‌ స్క్రిప్ట్‌ పట్టుకొని చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ముందు ఆయన దిగిన ఫోటోను కూడా షేర్‌ చేశారు. అనుకోకుండా బయటికి వచ్చిన ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ న్యూస్‌ని, ఫోటోను షేర్‌ చేస్తున్నారు అభిమానులు.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రామ్‌చరణ్‌ ఇప్పటికే మైసూరు చేరుకున్నారు. మొదటి షెడ్యూల్‌ చరణ్‌తోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. సినిమాలోని ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్‌లో ఉంటారు. ఈ సినిమాలో జగపతిబాబు ఓ ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో ఆయనకు సంబంధించిన సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారు. ఈ సినిమాలో చరణ్‌ సరసన జాన్వీకపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ షెడ్యూల్‌లో జాన్వీ పాల్గొనే అవకాశం లేదట. ప్రస్తుతం బాలీవుడ్‌లో షూటింగ్స్‌తో బిజీగా ఉన్న జాన్వీ రెండో షెడ్యూల్‌లో ఆర్‌సి16 సెట్స్‌కి వచ్చే అవకాశం ఉంది. ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన జాన్వీ మరోసారి తన అందచందాలతో ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు సిద్ధమవుతోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .