English | Telugu

ప్రభాస్ తో నాకు సంబంధం లేదు!

రెబల్ స్టార్ ప్రభాస్ కి, వైఎస్ షర్మిలకు మధ్య రిలేషన్ ఉన్నట్టు గతంలో కొందరు ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఆ ప్రచారాన్ని ఖండించిన షర్మిల.. మరోసారి ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.

పొలిటికల్ మైలేజ్ కోసం తన అన్న జగన్మోహన్ రెడ్డి, తన పేరుని వాడుకుంటున్నారని షర్మిల ఫైర్ అయ్యారు. బాలకృష్ణ గారి బిల్డింగ్ ఉన్న ఐపీ అడ్రెస్ నుంచి నాపై తప్పుడు ప్రచారం జరిగిందని కేసు పెట్టినట్లు ఇటీవల జగన్ గారు ఎంటర్టైనింగ్ గా చెప్పారు. చెల్లెలిపై నిజంగా ప్రేమ ఉంటే, ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంక్వయిరీ చేయకుండా గాడిదలు కాసారా? అని షర్మిల ప్రశ్నించారు. ప్రభాస్ తో నాకు సంబంధం ఉన్నట్లు గత ఐదేళ్ళలో మీ సైతాన్ సైన్యం చేత ప్రచారం చేయించలేదా? అని నిలదీశారు. మీ మైలేజ్ కోసం ఏమైనా చేస్తారు. అమ్మ మీద కేసు పెడతారు, నాన్న పేరు సీబీఐలో పెడతారు, చెల్లి మీద తప్పుడు ప్రచారం చేస్తారని షర్మిల విరుచుకుపడ్డారు.

నేను అప్పుడు నా పిల్లల మీద ప్రమాణం వేసి చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను.. ప్రభాస్ తో నాకు సంబంధం లేదు. అసలు ప్రభాస్ ఎవరో కూడా నాకు తెలీదు. ప్రభాస్ అనే వ్యక్తిని ఇంతవరకు నేను చూడలేదు అని షర్మిల అన్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.