English | Telugu
ఇలాఖా మనదే.. తడాఖా మనదే : వరల్డ్ కప్ లైవ్‌లో రవితేజ
Updated : Oct 6, 2023
మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న విభిన్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయనున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ స్టార్ట్ చేశారు.
ప్రస్తుతం దేశమంతా వరల్డ్ కప్ ఫీవర్‌తో ఉంది. ఇందులో ప్రతి మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అందులోనూ ఇండియా మ్యాచ్ అంటే వేరే చెప్పక్కర్లేదు. అక్టోబర్ 8న ఇండియా తొలి మ్యాచ్ ఆడబోతోంది. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు. టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్‌లో భాగంగా అక్టోబర్ 8న జరిగే ఇండియా.. పాకిస్తాన్ మ్యాచ్ లైవ్‌లోకి ‘ఇలాఖా మనదే.. తడాఖా మనదే’ అంటూ రవితేజ ఎంటర్ అవుతున్నాడు. తమ ఛానల్‌లో ప్రసారమయ్యే క్రికెట్ లైవ్‌లో రవితేజ పాల్గొంటున్నాడని స్టార్ స్పోర్ట్స్ తెలుగు చానల్ వెల్లడిరచింది. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసింది. అక్టోబర్ 8 మధ్యాహ్నం గం 12.30లకు రవితేజ లైవ్ కార్యక్రమం ఉంటుందట. అంటే మ్యాచ్ ప్రారంభానికి ముందు రవితేజ లైవ్‌లోకి వస్తాడన్నమాట.
దాదాపు 50 సంవత్సరాల క్రితం పలు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన స్టూవర్ట్‌పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథను బేస్ చేసుకొని ‘టైగర్ నాగేశ్వరరావు సినిమా రూపొందింది. స్టూవర్ట్‌పురం నాగేశ్వరరావు.. టైగర్ నాగేశ్వరరావుగా ఎలా మారాడు అనేది ఈ సినిమా కథ. ఇప్పటివరకు రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడంతో రవితేజ ఈసారి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.