English | Telugu
రష్మీ మేకప్ మాన్ మృతి.. కన్నీళ్ళు తెప్పిస్తున్న నిజం
Updated : Jun 30, 2025
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలం నుంచి మేకప్ మాన్ గా వర్క్ చేస్తు వస్తున్నారు 'వేణు'(Venu). ప్రస్తుతం ప్రముఖ నటి, జబర్దస్త్ షో యాంకర్ 'రష్మీ'(Rashmi Gautam)కి పర్సనల్ మేకప్ మాన్ గా చేస్తు పరిశ్రమలోనే సీనియర్ మేకప్ మాన్ గా గుర్తింపు పొంది,కెరీర్ పరంగా ఎన్నో అవార్డుల్ని సైతం అందుకున్నాడు.
రీసెంట్ గా వేణు నిన్న రాత్రి హైదరాబాద్ కృష్ణానగర్ ఏరియాలో రాత్రి పది గంటలకి ఆర్ టి సి బస్ కింద పడి చనిపోవడం జరిగింది. సమీపంలోనే ఉన్న మేకప్ యూనియన్ మీటింగ్ లో పాల్గొని వస్తుండగా ఆ సంఘటన జరిగింది. ఊహించని ఈ సంఘటనతో చిత్ర పరిశ్రమలోని అన్ని సంఘాలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యాయి. వేణు కుటుంబ సభ్యులకి తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.
హైదరాబాద్ లోని సినీ కార్మికులకి నిలయమైన చిత్రపురి కాలనీలో వేణు నివాసం ఉంటుండగా . ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత దహన సంస్కార కార్యక్రమాలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. ఇక ప్రమాద సంఘటనకి కారణమైన బస్ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
