English | Telugu

ఆల్కహాల్ లో మునిగి తేలుతున్న అల్లరి నరేష్!

అప్పట్లో కామెడీ హీరోగా ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న అల్లరి నరేష్.. కొన్నేళ్లుగా విభిన్న చిత్రాలు చేస్తూ నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మరో వైవిధ్యభరితమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. (Allari Naresh)

అల్లరి నరేష్ తన తదుపరి చిత్రాన్ని 'ఫ్యామిలీ డ్రామా' ఫేమ్ మెహర్ తేజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నేడు(జూన్ 30) నరేష్ పుట్టినరోజు సందర్భంగా మూవీ టైటిల్ ని, ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. (Alcohol First Look)

నరేష్ కొత్త చిత్రానికి 'ఆల్కహాల్' అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది. పోస్టర్ లో ఆల్కహాల్ లో మునిగి తేలుతున్నట్టుగా అల్లరి నరేష్ కనిపిస్తున్నాడు. టైటిల్ లో ఆల్కహాల్, పోస్టర్ లో ఆల్కహాల్ చూస్తుంటే.. సినిమాలో ఆల్కహాల్ ను ముడిపెడుతూ ఏదో కొత్త కథ చెప్పబోతున్నారని అర్థమవుతోంది. మరి ఇందులో నరేష్ ఎలా కనిపిస్తాడో చూడాలి.

సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రుహాని శర్మ హీరోయిన్. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా జిజు సన్నీ, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.