English | Telugu

ఒక‌రితో ల‌వ్వు.. ఇంకొక‌రితో రొమాన్సూ

టాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న రాశీఖ‌న్నాపై రూమ‌ర్లేం త‌క్కువ‌గా రాలేదు. తొలి సినిమా చేస్తున్న‌ప్పుడే ప్రేమ‌లో ప‌డిపోయింద‌ని చెప్పుకొన్నారు. ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమా చేస్తున్న‌ప్పుడే నాగ‌శౌర్య‌తో ల‌వ్వాట ఆడింద‌న్న గుస‌గుస‌లు వినిపించాయి. సినిమా అయిపోయినా.. కొన్నాళ్లు వీళ్ల మ‌ధ్య కెమిస్ట్రీ న‌డిచింద‌ని టాక్‌.

నాగ‌శౌర్య ఇంట్లో ఈ విష‌యం తెలిసి సీరియ‌స్ అయ్యార‌ని.. ఆ త‌ర‌వాత ఈ ప్రేమాయ‌ణానికి పుల్‌స్టాప్ ప‌డింద‌ని స‌మాచారం. అయితే.. ఇప్పుడు మ‌రో యువ హీరోతో రాశీఖ‌న్నా రొమాన్స్ మొద‌లెట్టేసింద‌ట‌. ఇద్ద‌రూ ఇప్పుడు డీప్ ల‌వ్‌లో ఉన్నార‌ని.. షూటింగులు లేక‌పోతే.. ఇద్ద‌రూ లాంగ్ డ్రైవ్‌ల‌తో హంగామా చేస్తున్నార‌ని టాక్‌.

హైద‌రాబాద్‌లో రాశీ సెటిల్ అవ్వ‌డానికి.. ఇక్క‌డో ఫ్లాటు చూసుకోవ‌డానికి ఆ హీరో... బాగా సాయం చేశాడ‌ట‌. అంతేకాదు.. హైద‌రాబాద్ శివార్ల‌లో రాశీఖ‌న్నాకు ఓ ఖాళీ స్థ‌లం చీప్‌లో కొని పెట్టాడ‌ని టాక్‌. మొత్తానికి ఒక హీరోతో ల‌వ్‌.. మ‌రో హీరోతో రొమాన్స్ డ్రామా న‌డుపుతున్న రాశీ... మ‌హా ముదురుదే.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.