English | Telugu
రణవీర్, దీపికా.. రోడ్ సైడ్ రోమాన్స్
Updated : Oct 6, 2015
దీపికా పదుకునే.. రణవీర్ సింగ్ ల మధ్య ఎప్పటినుండో ప్రేమాయణం సాగుతుందని అందరికి తెలసిన న్యూసే. చాలా సార్లు ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగారు కూడా. అయితే ఇప్పుడు మాత్రం స్ఫెషల్ గా కనిపించే సరికి అందరూ ఒకటే గుసగుసలాడుకుంటున్నారు. అంత స్పెషల్ ఏంటబ్బా అనుకుంటున్నారా.. రణవీర్.. దీపికా ఇద్దరూ కలిసి ఏంచక్కా ఫారిన్ టూర్ కి వెళ్లి హ్యాపీగా పదిరోజులు ఎంజాయ్ చేసి తిరిగి ముంబైకి తిరిగి వచ్చారు. అయితే ముంబై ఎయిర్ పోర్టులో దిగిన వీరిద్దరూ ఎవరి దారిన వాళ్లు వెళ్లకుండా అక్కడే అసభ్యకరంగా ప్రవర్తించారట. ఇద్దరూ సెడాంఫ్ ఇచ్చుకుంటూ పనిలో పనిగా లిప్ లాక్ లాగించేశారట. అయితే తమను ఎవరూ చూడరూ అని అనుకున్నారమో పాపం.. అక్కడ ఉన్న ఎవరో ఈ రోడ్ సైడ్ రోమాన్స్ ని కెమెరాలో క్లిక్ అనిపించి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశారు. ఇంకేముంది ఇప్పుడు ఈ ఫొటోలు పెద్ద హాట్ టాపిక్ గా మారాయి ఇప్పుడు. ఏది ఏమైనా ఎక్కడ చేయాల్సిన పని అక్కడ చేస్తే ఈ రచ్చ రచ్చ ఉండదని కొందరు అభిప్రాయపడుతున్నారు.