English | Telugu

చెర్రీ, రకుల్.. ఏకంగా 24 గంటలు


రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ ఇద్దరు జంటగా బ్రూస్ లీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ హీరో హీరోయిన్లను అందరూ తెగ పొగిడేస్తున్నారంట. అంతలా పొగిడే పని వీరేం చేశారనే కదా డౌట్. ఎందుకంటే... ఈ సినిమా ఆడియో ఫంక్షన్ రీసెంట్ గానే జరిగింది. అయితే ఈ ఫంక్షన్ రాంచరణ్ తేజ్ చెప్పిన మాట గుర్తుండే ఉంటుంది. ఒక్క టైటిల్ సాంగ్ తప్ప మిగతా షూటింగ్ పూర్తయిందని.. దానిని కూడా త్వరలోనే పూర్తి చేసి ఈనెల 16 న రిలీజ్ చేస్తామని చెప్పారు. దీనిలో భాగంగానే ఇప్పుడు చెర్రీ.. రకుల్ ఇద్దరూ కలిసి షూటింగ్ లో నెగ్లెక్ట్ చేయకుండా పాల్గొంటున్నారట. మిగిలిన టైటిల్ సాంగ్ కోసం వీరిద్దరూ ఏకంగా 24 గంటలు అంటే అక్టోబర్ 5 ఆదివారం 7 గంటల నుండి మరుసటి రోజు 7 గంటల వరకూ షూటింగ్ లో పాల్గొని యూనిట్ అందరూ ఆశ్చర్యపోయేలా చేశారంటా. ఇంకా ఈ సినిమా రిలీజ్ కు పది రోజుల గడువు మాత్రమే ఉండటంతో వీరిద్దరూ బాగా కష్టపడుతున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఈ పదిరోజుల్లో తమన్ ప్రొడక్షన్ - మిక్సింగ్ కార్యక్రమాలు చూసుకుంటే.. చెర్రీ, రకుల్ ప్రమోషన్ల కార్యక్రమంలోకి దిగునున్నారు. మొత్తానికి చెర్రీ.. రకుల్ కమిట్ మెంట్ తో సినిమా కంప్లీట్ చేయడానికి బాగానే కష్టపడ్డారు. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూద్దాం..

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.