English | Telugu

వర్మకు మరో శ్రీదేవి దొరికేసినట్టుంది...!

రామ్ గోపాల్ వర్మకు శ్రీదేవి అంటే పిచ్చి. ఒక ఇంటర్వ్యూలో నన్ను ఎవరైనా ఒకర్ని చంపమని ఛాన్స్ ఇస్తే, శ్రీదేవిని పెళ్లి చేసుకున్నందుకు బోనీ కపూర్ ను చంపుతాను అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. ఆమె తప్ప అతని కంటికి ఇంకెవరూ పెద్ద నచ్చరట. అలాంటి వర్మ లేటెస్ట్ గా రాధికా ఆప్టే అందానికి ఫిదా అయిపోయాడు. తన మూడు జన్మల్లో ఇంత అందాన్ని చూడలేదంటూ ఆమె ఫోటోను ట్వీట్ చేసి ఆనందపడిపోతున్నాడు వర్మాజీ. రాధికా ఆప్టే వర్మ తీసిన రక్త చరిత్రలో నటించింది. లెజండ్ సినిమాతో తెలుగుప్రేక్షకులకు సుపరిచితురాలైన రాధిక, ప్రకాష్ రాజ్ తీసిన ధోనీ సినిమాలో, రజనీ కబాలీ లో కూడా మెరిసింది. కాగా ట్రెడిషనల్ గానే కాక, ఏ పాత్ర ఇచ్చినా ఒదిగిపోతుందనే పేరు తో పాటు, అందాల ఆరబోతకు కూడా తాను సిద్ధమేనని తన ఫోటోషూట్ ల ద్వారా సిగ్నల్స్ ఇస్తోందీ భామ. భాషతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ దూసుకుపోతున్న ఈ భామ, రానున్న రెండు మూడేళ్లలో బాలీవుడ్ లో ట్రెండ్ క్రియేట్ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, తన అతిలోకసుందరి శ్రీదేవిని తప్ప మరొకరిని పొగడని వర్మ, తాను మూడు జన్మల్లో చూడనంత అందగత్తె అని రాధికా ఆప్టేకు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఆకాశానికెత్తేస్తున్నాడు. వర్మ గారి కన్ను ఈ భామపై పడిందేటబ్బా అంటూ బాలీవుడ్ జనాలు కిసుక్కుమంటున్నారు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.