English | Telugu

గ్యాంగ్‌స్టార్‌ను కోట్ల మంది ఎందుకు అభిమానిస్తున్నారు..అదే వర్మ "రాయ్"

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఫ్యాక్టరీ నుంచి కొత్త డాన్ తయారవుతున్న సంగతి తెలిసిందే. మాజీ గ్యాంగ్‌స్టార్ "ముత్తప్పరాయ్" జీవిత కథ ఆధారంగా "రాయ్" అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు వర్మ. టైటిల్ రోల్‌లో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. యాభై కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోన్నఈ మూవీ ఫస్ట్‌లుక్‌ని బెంగళూరులో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వర్మ మాట్లాడుతూ-"30 రూపాయలతో అతని జీవితం ప్రారంభమవుతుంది. 30 ఏళ్ల నేర జీవితంలో 30 వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? ఇరవై హత్య కేసుల్లో నుంచి 21 నెలల్లో ఎలా బయటపడ్డాడు? 'నేరస్థుడి జీవితం చీకటి' అని చరిత్ర చెబితే, కాదు వేయి సూర్యుల వెలుగు అని ఎలా నిరూపించాడు? నేరాలు చేసిన అతణ్ణి కోట్ల మంది ప్రజలు ఎందుకు అభిమానిస్తున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది అని తెలిపారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.