English | Telugu

ఎట్టకేలకు బ్రహ్మోత్సవంలో కాజల్ లుక్ బయటికొచ్చింది...!

బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్, ఫస్ట్ టీజర్ రిలీజ్ చేయడం మొదలెట్టిన తర్వాత మూవీకి సంబంధించిన ఐదారు అప్ డేట్స్ వచ్చాయి. కానీ వేటిలోనూ కాజల్ ముఖం లేదు. ఇప్పటి వరకూ కేవలం సమంతను మాత్రమే చూపిస్తూ వచ్చిన బ్రహ్మోత్సవం మూవీ టీం, ఎట్టకేలకు సినిమాలో కాజల్ లుక్ ను కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు కూడా లుక్ రిలీజ్ చేయకపోతే, సినిమాలో కేవలం సమంత మాత్రమే హీరోయిన్ అని జనాలు అనుకునే సమస్య లేకపోలేదు. ఈరోజు రిలీజ్ చేసిన లుక్ తో కాజల్ ఫ్యాన్స్ కూడా ఖుష్ అవుతున్నారు. మహేష్, కాజల్ ఇద్దరూ కూడా కూల్ గా రిలాక్స్ అవుతున్న స్టిల్, ఇప్పటి వరకూ రిలీజైన అన్ని బ్రహ్మోత్సవం పోస్టర్లలాగే చాలా కలర్ ఫుల్ గా ఉంది. బయట టూర్ కు వచ్చి, కాసేపు దారిలో కార్ ఆపి రిలాక్స్ అవుతున్నట్టుగా ఈ స్టిల్ ఉంది. మహేష్ లుక్ ఆల్ మోస్ట్ పోలీస్ లా ఉంది. ఖాకీ కలర్ ఫ్యాంట్, బ్లాక్ టీషర్ట్, బ్లాక్ గ్లాసెస్ తో మహేష్ స్టైలిష్ గా కనిపిస్తుంటే, క్యాజువల్ వేర్ లో కాజల్ కేమేరా వైపు ప్రశాంతంగా చూస్తున్న ఈ స్టిల్ మహేష్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇక మూడో హీరోయిన్ ప్రణీతతో కూడా లుక్ రిలీజ్ చేసేస్తే, మూవీలోని అందరు హీరోయిన్ల లుక్స్ రిలీజ్ చేసినట్టు అవుతుంది. మే 7న రిలీజ్ కానున్న మూవీ ఆడియో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఆ రోజే అన్ని లుక్స్ తో పాటు, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న అఫీషియల్ ట్రైలర్ కూడా రిలీజవబోతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.