English | Telugu

రానాని అందుకు కాదు తీసుకుంది - వర్మ

"రానాని అందుకు కాదు తీసుకుంది" అని వర్మ అన్నారట. వివరాల్లోకి వెళితే ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ తాను త్వరలో నిర్మించబోతున్న హిందీ సినిమా "డిపార్ట్ మెంట్" లో రానాని హీరోగా తీసుకోవటానికి గల కారణాలను ముంబయ్ మీడియా తమాషాగా వివరించింది. అభిషేక్ బచ్చన్, రానా, బిపాసా బసు నటించగా ఇటీవల విడుదలైన "దమ్ మారో దమ్" చిత్రం విడుదలకు ముందే ఆ చిత్రం క్లైమాక్స్ ను రామ్ గోపాల వర్మ అందరికీ యస్.యమ్.యస్.ల ద్వారా తెలిసేలా చేశాడట. అందుకు అలిగిన అభిషేక్ చ్చన్ "డిపార్ట్ మెంట్" సినిమాలో నటించనన్నాడనీ, అందుకనే గతిలేని పరిస్థితుల్లోనే రామ్ గోపాల వర్మ రానాని హీరోగా తీసుకున్నాడనీ ముంబయ్ మీడియా అంటోంది.

కానీ అది నిజం కాదనీ తాను ఎవరికీ "దమ్ మారో దమ్" చిత్రం క్లైమాక్స్ ని ఆ చిత్రం విడుదలకు ముందే ఎవరికీ యస్.యమ్.యస్.ల ద్వారా పంపలేదనీ అన్నాడు వర్మ. రానాని "డిపార్ట్ మెంట్" మూవీలో హీరోగా తీసుకోటానికి కారణం, అభిషేక్ బచ్చన్ డేట్లు సర్దుబాటు కాకపోవటం వల్లనే అని మీడియాకు తెలిపాడు వర్మ. అంతేకాక తనకు అమితాబ్ బచ్చన్ కుటుంబం అంటే చాలా గౌరవం అనీ, అభిషేక్ బచ్చన్ అంటే అభిమానమనీ కూడా వర్మ అన్నాడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.