English | Telugu

మీసాల్లేకుండా ఎవరు బాగుంటారు...బాలయ్యా, చిరంజీవా

మీసాల్లేకుండా ఎవరు బాగుంటారు...బాలయ్యా....? చిరంజీవా....? అన్న ప్రశ్న ఫిలిం నగర్ లో ఇటీవల తలెత్తింది. మామూలుగా హాలీవుడ్ హీరోలు గానీ, మన బాలీవుడ్ హీరోలు గానీ మీసాల్లేకుండానే ఎక్కువగా సినిమాల్లో కానీ, బయటకానీ కనిపిస్తుంటారు. నటుడనే వాడు మీసాలున్నా కానీ, లేకున్నా కానీ అందంగా కనిపించాలి. అప్పుడే అన్ని రకాల పాత్రలూ పోషించగలడు, తన నటనలో నవరసాలనూ తన ముఖంలో పలికించగలడు.

కానీ మన తెలుగు సినిమా హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి వారు సహజంగా మీసాల్లేకుండా కనిపించటం అత్యంత అరుదైన సంగతి. కానీ హాస్యబ్రహ్మ స్వర్గీయ జంధ్యాల దర్శకత్వంలో మన మెగాస్టార్ చిరంజీవి "చంటబ్బాయ్" చిత్రంలో ఇలా మీసాల్లేకుండా కనిపిస్తారు. అలాగే ఒక సందర్భంలో యువరత్న నందమూరి బాలకృష్ణ కూడా మీసాల్లేకుండా కనిపించారు. మరి వీళ్ళిద్దరిలో మీసాల్లేకుండా ఎవరు బాగున్నారో మీరే చెప్పండి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.