English | Telugu

ఈ ఐస్‌క్రీం స్పైసీగా వుంటుంది


పేరేమో చల్లని ఐస్‌క్రీం. సినిమా ట్రెయిలర్ చూస్తే మాత్రం హడలు. ఇంత వెరైటీగా చిత్రాన్ని రూపొందించగలిగేది క్రేజీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మాత్రమే. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఐస్‌క్రీం. చిత్రం ట్రెయిలర్ విడుదల చేసే వరకు ఈ చిత్రం నిర్మిస్తున్న సంగతే ఎవరికీ తెలియదు. అదీ రామ్ గోపాల్ వర్మ ప్రత్యేకతల్లో ఒకటి. నవదీప్, తేజస్వీ నటించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్భాటం లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ట్రెయిలర్ కి చక్కటి రెస్పాన్స్ లభిస్తోంది.


తాజాగా చిత్రయూనిట్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించి ఈ సినిమా రెండవ ట్రెయిలర్ ను విడుదల చేశారు. ఫ్లో కాం టెక్నాలజీ తో రూపొందించిన ఈ చిత్రం రెండవ టీజర్ పూర్తి సస్పెన్స్ తో కూడుకుంది. శివ సినిమాలో స్టడీ క్యాం టెక్నాలజీ వాడి అప్పట్లో సంచలనం సృష్టించిన రాం గోపాల్ వర్మ తాజాగా యూజ్ చేసిన ఫ్లో క్యాం టెక్నాలజీతో మరో సెన్సెషన్ క్రియేట్ చేయబోతున్నారు. ఆసియాలోనే తొలిసారి ఈ టెక్నాలజీని సినిమా నిర్మాణానికి వాడారు. రాం గోపాల్ వర్మ ఈ కొత్త టెక్నాలజీతో ఎటువంటి ప్రయోగం చేశారో చూడాలని, పరిశ్రమ యావత్తు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.