English | Telugu

హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు కావాలి?

రామ్ చరణ్ నటించిన 'బ్రూస్ లీ' సినిమా అభిమానుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మొదటి షో నుంచే ఈ సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చిన వసూళ్ళను రాబట్టంలో మాత్రం జోరును చూపించింది. చాలా మంది స్టార్ హీరోలు 40 కోట్లు అందుకోవడానికి ముప్పతిప్పలు పడుతుంటారు. కానీ రామ్ చరణ్ బ్రూస్ లీ ఫ్లాప్ టాక్ తోనే అవలీలగా 40కోట్ల మార్క్ ను అందుకుంది. అప్పుడు ఈ సినిమా హిట్‌ లేదా సూపర్‌ హిట్‌ అనాలి. కానీ 'బ్రూస్‌లీ' ఫ్లాప్‌ మూవీ అంటున్నారు. తేడా ఎక్కడా వుంది? అంటే కాస్ట్‌ ఫెయిల్యూర్‌ అని అంటున్నారు. అవసరానికి మించి ఖర్చు చేయడం వల్లే ఈ పరిస్థితి వస్తోంది. ఈ సినిమా సబ్జెక్టు కి చాలా తక్కువలో కూడా సినిమా తీయవచ్చని సినీ విశ్లేషకుల భావన. అనవసర ఖర్చు తగ్గించుకుని వుంటే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేదని అంటున్నారు. ఏదిఏమైనా ఫ్లాప్ నుంచి మన నిర్మాతలు, దర్శకులు పాఠాలు నేర్చుకోవడం అసాధ్యమని ఇండస్ట్రీ వర్గాల టాక్.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.