English | Telugu

రామ్‌ చరణ్‌ 'బ్రూస్ లీ'యే

రామ్‌ చరణ్‌ కొత్త సినిమా టైటిల్ సస్పెన్స్ కి తెరదించాడు డైరెక్టర్ శ్రీనువైట్ల. చరణ్ శ్రీనువైట్ల సినిమా పేరు బ్రూస్ లీ మొదట్లో వార్తలు వచ్చిన వాటిని ఏవరు పట్టించుకాకపోవడంతో మరికొన్ని పేర్లు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు సడన్ గా చరణ్ సినిమా పేరు బ్రూస్ లీ అంటూ ఫస్ట్ లుక్ ఫోటోలను, టైటిల్ లోగోను బయటకు వదిలింది చిత్ర యూనిట్. అక్టోబర్‌ 16న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మాత్రం సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా బ్యాలెన్స్‌ వున్న వర్క్‌ ఈ నెల రోజుల్లో పూర్తవుతుందా లేదా అనేది అనుమానంగా వుంది. దసరాకి ఎట్టి పరిస్థితుల్లోను విడుదల చేయాలనే ప్రెజర్‌ వున్నప్పటికీ హడావిడిగా సినిమాని చుట్టి పారేయడానికి కూడా ఎవరూ ఇష్టపడడం లేదట. ఇప్పటి స్టేటస్‌ని బట్టి ఈ చిత్రాన్ని దసరాకి విడుదల చేయడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.