English | Telugu

ర‌కుల్ ఆఫ‌ర్‌.. రామ్‌చ‌ర‌ణ్‌కేనా???

ర‌కుల్ ప్రీత్ సింగ్‌... తెలుగు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన క‌థానాయిక‌. ఒక్క‌సారిగా టాప్ స్టార్ల‌తో క‌ల‌సి న‌టించే అవ‌కాశం ద‌క్కించుకొని.. బ‌డా హీరోయిన్ల క‌న్నుకుట్టేలా చేసింది. ఏ సినిమా చేసినా.. ర‌కులే క‌థానాయిక‌గా క‌నిపించింది. దానికి తోడు హిట్లూ వ‌చ్చాయి. అంతే.. ఒక్క‌సారిగా పారితోషికాన్ని కోటికి పెంచేసింది. అంత‌కు ముందు పాతిక ల‌క్ష‌లిచ్చి, కాల్షీట్లు కొనుక్కొన్న వాళ్లు కూడా ర‌కుల్ డిమాండ్‌కి త‌గ్గ‌ట్టుగానే కోటి చ‌దివించుకొన్నారు. అయితే.. ఒక్క‌సారిగా ర‌కుల్ ఫేటు మారింది. సినిమాల‌న్నీ ఫ్లాపుల‌య్యాయి. కిక్ 2, బ్రూస్లీ డిజాస్ట‌ర్ల‌తో నేల‌కు దిగింది. నాన్న‌కు ప్రేమ‌తో విజ‌యంతో కాస్త ఊపిరి తీసుకొంది. అయితే అనూహ్యంగా రామ్ చ‌ర‌ణ్ కోసం త‌న రెమ్యున‌రేష‌న్ స‌గానికి స‌గం త‌గ్గించుకొని షాక్ ఇచ్చింది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ చేస్తున్న త‌నిఒరువ‌న్ రీమేక్‌లో క‌థానాయిక‌గా ఎంపికైంది ర‌కుల్‌.

ఈ సినిమా కోసం రూ.60 ల‌క్ష‌ల పారితోషికం తీసుకొంది. దాంతో మిగిలిన నిర్మాత‌లు, హీరోలూ నివ్వెర పోతున్నారు. ఫ్లాపుల్లో ఉన్నా.. రేటు త‌గ్గించ‌ని ర‌కుల్ రామ్‌చ‌ర‌ణ్‌పై ఇంత ద‌య ఎలా చూపించిందంటూ సెటైర్లు వేసుకొంటున్నారు. మా సినిమాలోనూ అంత‌కే న‌టిస్తావా? అని అడిగితే. `నా రిబేటు రామ్ చ‌ర‌ణ్‌కే` అన్న‌ట్టు మాట్లాడుతోంద‌ట‌. ఈ ఒక్క సినిమాకే పారితోషికం త‌గ్గించా, మీరు మాత్రం య‌థావిధిగా కోటి ఇవ్వాల్సిందే అని చిల‌క ప‌లుకులు ప‌లుకుతోంద‌ట‌. మ‌రి రామ్‌చ‌ర‌ణ్‌కే అంత బంప‌ర్ ఆఫ‌ర్ ఎందుకో మ‌రి! ? బ్రూస్లీ ఫ్లాప్ అయ్యింద‌న్న కన్స‌ర్న్ తో ఆఫ‌ర్ ఇచ్చిందంటారా? ఏమో... ఆ సంగ‌తి ర‌కుల్‌కే తెలియాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.