English | Telugu

అల్లరి నరేష్ ఆవిష్కరించిన 'టెర్రర్' ట్రైలర్

శ్రీకాంత్, నికితా జంటగా అఖండ భారత్ క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమా సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన సినిమా 'టెర్రర్'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 26న విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రైలర్ ని ఆవిష్కరించిన హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో అందరికీ కావాల్సిన హీరో శ్రీకాంత్ గారు. ఆయన నేను ఎప్పుడు కలిసిన సినిమాల గురించే మాట్లాడుకుంటాం. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కువగా మాట్లాడింది టెర్రర్ సినిమా గురించే. ట్రైలర్ చాలా బాగుంది. ఆయన నటించిన ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలి. నిర్మాతకు మంచి లాభాలు రావాలి'' అని అన్నారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ''ఈ యూనిట్ తో వండర్ ఫుల్ జర్నీ చేశాను. స్క్రిప్ట్ నెరేషన్ విధానం నచ్చి సినిమా చేయడానికి రెడీ అయ్యాను. దర్శకుడు సతీష్ సినిమాను క్లీన్, నీట్ గా డైరెక్ట్ చేశారు. సాయికార్తీక్ అద్భుతమైన రీరికార్డింగ్ ఇచ్చాడు. ఖచ్చితంగా కమర్షియల్ గా సినిమా విజయం సాధిస్తుంది. నిర్మాత ఈ సినిమా సక్సెస్ తో మరిన్నిసినిమాలు చేయాలి '' అని అన్నారు.

నిర్మాత షేక్ మస్తాన్ మాట్లాడుతూ.. ''నేను ఇండస్ట్రీకి కొత్త. కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. శ్రీకాంత్ సహా నటీనటులు, డైరెక్టర్ సతీష్ గారు మిగతా టెక్నిషియన్స్ సపోర్ట్ తో మంచి సినిమా తీయగలిగాం'' అని అన్నారు.

దర్శకుడు సతీష్ కాశెట్టి మాట్లాడుతూ.. ''ఈకాలంలో సినిమా చేయడమనేది పెద్ద విషయం కాదు. కానీ సినిమాను రిలీజ్ చేయడం చాలా కష్టమైన విషయం. నిర్మాతగారు ఇచ్చిన సపోర్ట్ తో సినిమా విడుదలకు రెడీ అయ్యింది. సినిమా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.