English | Telugu

రకుల్ ప్రీత్ కు ఆ ఒక్కటీ సరిపోదట..!

పని చేసిన తర్వాత చాలా మంది అలిసిపోయి విశ్రాంతి కోరుకుంటారు. తర్వాత పని అలసట తీరిన తర్వాత చేద్దాంలే అనుకుంటారు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం అలా కాదట. రెస్ట్ తీసుకోవడమంటే తనకు చిరాకు అని చెబుతోందీ అమ్మడు. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోల సినిమాల్లో వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న రకుల్ భామకు, ఒక్క నిముషం ఖాళీ దొరికినా ఇష్టం ఉండదంటోంది. " ఒకేసారి హీరోయిన్ గా రెండేసి మూడేసి సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నా, ఇంకా ఏదో చేయాలనే ఉంటుందట. అందుకే ఫిట్ నెస్ ఛైన్ ను కూడా స్టార్ట్ చేసింది. చిన్నప్పటి నుంచి మా అమ్మానాన్నలు నన్ను ఇలాగే పెంచారు. రోజుకు ఐదారు గంటలకు మించి నిద్రపోను. రోజంతా బిజీగా ఉండాలని ఆలోచిస్తుంటాను. ఫిట్ నెస్ వ్యాపారంలోకి ప్రారంభించి జిమ్ ను స్టార్ట్ చేశాను. ఇదే కాక, భవిష్యత్తులో మరిన్ని వెంచర్స్ స్టార్ట్ చేస్తాను. ఏం చేసినా, రోజంతా బిజీగా ఉండటం నాకు చాలా ఇష్టం " అని చెబుతోందీ భామ. మొన్నే సరైనోడుగా ప్రేక్షకుల్ని పలకరించిన రకుల్, రామ్ చరణ్ తర్వాతి సినిమా థ్రువలో మెరవనుంది. బెల్లంకొండ శ్రీనివాస్ బోయపాటి కాంబోలో రాబోతున్న సినిమాకు కూడా రకుల్ సైన్ చేసిందని సమాచారం.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.