English | Telugu

లీకైన హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల క్లోజ్ ఫోటోలు..!

బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల వ్యవహారం థ్రిల్లర్ సినిమా కంటే ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఇద్దరూ ఆరోపణలు చేసుకుంటూ ఒకరి పరువును మరొకరు దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు. హృతిక్ మెయిల్ కు కంగనా ఆరువేల మెసేజ్ లు పంపిందని సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా కంగనా తరపు న్యాయవాది, వాళ్లిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫోటోల్ని కోర్టుకు సమర్పించారు. దీంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది.

హృతిక్ న్యాయవాదులు స్పందిస్తూ, కంగనా అబద్ధాల్ని నిజం చేయాలని ప్రయత్నిస్తోందని, అందరూ కలిసి తీసుకున్న ఫోటోల్ని కేవలం వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్నట్టుగా ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తోందని, పార్టీ లో ఉన్న అసలు ఫోటోల్ని విడుదల చేశారు. ఆ ఫోటోల్లో హృతిక్ మాజీ భార్య సుజానే కూడా ఉండటం విశేషం. కాగా తనను బాయ్ ఫ్రెండ్ గా అందరికీ ప్రచారం చేస్తున్న కంగనా తనకు అందరిముందూ క్షమాపణలు చెప్పాలంటూ హృతిక్ ఆమెకు లీగల్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.